కుంటాల/సోన్/సారంగాపూర్/భైంసాటౌన్:
గురుకుల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని లెఫ్ట్ పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్, నిర్మల్ జిల్లా సమన్వయ అధికారి ఆర్.ప్రశాంతి, సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, సారగాపూర్ పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, భైంసా పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత తెలిపారు. తెలిపారు. ఐదో తరగతి నుంచి 9వ తరగతిలో అడ్మిషన్ కోసం జిల్లాలోని ఎంపిక చేసిన 15 సెంటర్లలో 23(ఆదివారం) ఫిబ్రవరి 2025 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ , బ్లూ, బ్లాక్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకుని రావాలని వివరించరు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. వివరాలకు 7995010575, 9642200405 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment