నిర్మల్‌టౌన్: మహాశివరాత్రికి ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ నిర్మ ల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ బస్సులు 25, 26, 27 తేదీల్లో నడుపుతుమని పేర్కొన్నా రు. వేములవాడకు 30 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సులు అదనపు చార్జీలు వసూలు చేస్తామన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపా రు. వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.140 చార్జి ఉంటుందని పేర్కొన్నారు. కదిలి పాపహరేశ్వర్, బూరుగుపల్లికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30, కాల్వకు పెద్దలకు రూ.40, పిల్ల లకు రూ.20 చార్జి వసూలు చేయనున్నట్లు వివరించారు. ఏదైనా గ్రామంలో 50 మంది ఉంటే బస్సు పంపుతామన్నా రు. వివరాలకు 9959226003, 9492767879 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment