కాంగ్రెస్ మహిళా నాయకుల నియామకం
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దుర్గ భవాని నూతన జిల్లా కార్యవర్గాన్ని శనివారం నియమించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలిగా తన్నే లక్ష్మి, కడెం మండలం అధ్యక్షురాలిగా మాదాసు సురేఖ, సోన్ మండలం అధ్యక్షురాలిగా రేఖ, నిర్మల్ పట్టణ అధ్యక్షురాలిగా వాసవి, కుభీర్ మండలం అధ్యక్షురాలిగా నిఖిత రాథోడ్, కుంటాల మండలం అధ్యక్షురాలిగా గంగామణిని నియమించారు. ఈమేరకు నియామకపత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పని చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment