పునరావాస కల్పనలో విఫలం
కడెం: పులుల సంరక్షణ పేరిట అమాయక గిరిజన కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు ఆరోపించారు. మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాన్ని ఆదివారం మా నవ హక్కుల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో సందర్శించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ కుటుంబానికి ఐదెకరాలిస్తామని రెండెకరాల అటవీ భూమి ఇచ్చారని, డబుల్ బెడ్రూంలు నిర్మించినా నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. గ్రా మస్తులు ఇక్కడికి వచ్చిన నుంచి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అటవీ హక్కుల రక్షణ చట్టం ప్రకారం అడవిలో నివసిస్తు న్న మానవులను మనుషులుగా గుర్తించాలని కోరా రు. అటవీ హక్కుల చట్టం 2006లో ఉన్న అంశాలనూ అధికారులు ధిక్కరించారని ఆరోపించారు. చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వేదిక కా ర్యవర్గ సభ్యులు రఘోత్తమ్‌రెడ్డి, ప్రజ్ఞశీల్, అతిశ్‌కుమార్, గోపీనాథ్, సోన్ కాంబ్లే తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment