పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూట్కూరి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు కూడా తమ మద్దతుదారుల గెలుపునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలుతుందా? లేదా రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment