
సర్కారు విద్యకు సాంకేతిక దన్ను
● ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు ● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అ న్ని రకాలుగా అభివృద్ధిపరుస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాల విద్యావ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే అనేక సౌకర్యాలు సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఐదు చొప్పున కంప్యూట ర్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. రానున్న 2025–26 విద్యాసంవత్సరం జూన్ తొలి నాటికే ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు అందుబాటులో కి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా టూల్స్ ద్వారా ఇంగ్లిష్, గణితం బోధనలో వినియోగి స్తోంది. దీంతో జిల్లాలోనూ ప్రభుత్వ రంగంలోని 535 ప్రైమరీ స్కూళ్లలో కంప్యూటర్లు అందుబా టులోకి రానున్నాయి. దాదాపు 24వేలకు పైగా వి ద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న ల క్ష్యంతో పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ప్రైవేట్‌కు దీటుగా..
ప్రైవేట్ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలకు దీ టుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ అన్ని సదుపాయాలు సమకూర్చుతోంది. అవసరమున్న చోట ఉపాధ్యాయులను నియమిస్తూనే మరింత నాణ్య మైన బోధన అందించాలనే లక్ష్యంతో వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. అమ్మ ఆ దర్శ పాఠశాలల పేరిట అన్ని స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తోంది. ఇప్పటికే విద్యుత్, ఫ్యాన్లు, తరగతి గదులు, ప్రయోగశాల గదులు అందుబా టులోకి వస్తున్నాయి. మరోవైపు కేంద్రం ద్వారా పీఎంశ్రీ పథకంతో పాటు తరగతి గదుల్లో ఐఎ ఫ్పీ ప్యానెల్ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా గ్రీన్ బోర్డులు లాంటివీ వినియోగిస్తున్నారు. జి ల్లాలో ఇప్పటికే ఏఐ ఆధారిత విద్యాబోధన కో సం 16 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రాథమిక పాఠశాలకు కంప్యూట ర్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సముచిత నిర్ణయమే
మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియలో నూతన సాంకేతిక విధానాలను వినియోగించడం శ్రేయస్కరం. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగిస్తూ బోధన చేస్తే వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది.
– రమణారావు,
పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి