నిర్మల్ టౌన్: నిర్మల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్ష ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా అల్లూరి మల్లారెడ్డి ప్రత్యర్థిపై 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా షేర్ నరేందర్ ప్ర త్యర్థి అభ్యర్థిపై 7 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా అంపోలి నర్సారెడ్డి, కో శాధికారిగా సీహెచ్.అర్చన, సంయుక్త కార్యదర్శిగా ముత్తన్న, లైబ్రరీ సెక్రెటరీగా రత్నం, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా వంశీ ఏకగ్రీ వంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు నూ నె గంగాధర్, వోస మహేందర్ తెలిపారు. అనంతరం విజేతలను సన్మానించారు.


