బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హూండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ అక్షరాభ్యా స మండపంలో 43 రోజుల హుండీ లెక్కింపు ను చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, హుండీల ద్వారా నగదు రూపంలో రూ. 53,36,176, బంగారం 73 గ్రాములు, వెండి 2 కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ 21 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణాధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, శ్రీజ్ఞాన సరస్వతి సేవాసమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


