సాగు పనులకు శ్రీకారం..
ఉగాది రోజే కొత్త సంవత్సర వ్యవసాయ పనులను సైతం ప్రారంభిస్తారు. ఇప్పటికే రైతులు తమ చేలల్లో పత్తి పంటను పీకేసి, భూములను చదును చేశారు. ఈ భూముల్లో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన పనుల శ్రీకారానికి రైతులు సన్నద్ధం అయ్యారు. ఈమేరకు అవసరమైన పరికరాల కొనుగోలు, తయారీ చేపట్టడంలో నిమగ్నమయ్యారు. వ్యవసాయమే జీవనాధారమైన గ్రామీణ రైతులు సంప్రదాయ బద్ధంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పండుగకు రెండుమూడు రోజుల ముందు నుంచే గ్రామాల్లో వడ్రంగులతో సాగుకు కావాల్సిన కర్రలు, దౌరలు, గొడ్డళ్లను సరి చేయించుకున్నారు. ఇప్పటికీ ఎడ్లు, నాగళ్లు ఉన్నవాళ్లు అరకలను సిద్ధం చేయించి పెట్టుకున్నారు.


