రంజాన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
నిర్మల్‌టౌన్: రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా వద్ద ఈ ద్గాను ఆదివారం ఎస్పీ జానకీ షర్మిల పరి శీలించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశా రు. ప్రార్థన సమయంలో ట్రాఫిక్ సమస్యలేకుండా చూసుకోవాలన్నారు. వాహనాల కోసం తగినంత పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈద్గా, మసీదులు, ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో దా దాపు 350 మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ప్రేంకుమార్, సిబ్బంది ఉన్నారు.
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రా జెక్టు సమీపంలో గల ఈద్గాను ఎస్పీ సందర్శించారు. భద్రతా ఏర్పాట్లపై అడిగి తెలు సుకున్నారు. ముస్లింల ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఐ గోపీనాథ్‌కు సూచించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ జాబీర్ అహ్మద్, ఎంఐఎం నాయకులు ఉన్నారు.


