
సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ
కడెం: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో లింగాపూర్ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ నిశిత విజయ్ కుమార్ తెలి పారు. నస్పురి వెంకటేశ్వర్ 1వ, రాజశేఖర్ 9వ, రాథోడ్ లోకేష్ 11వ, కుంసోత్ దీపక్ 12వ, రితీష్ నాయక్ 22వ, మాలవత్ కిషోర్ 94వ, గుండా అనిరుధ్ 135వ, చోలే ఆయుష్ 208వ, బొమ్మ మహాశ్రీ 222వ, క్రిష్ణరా జ్ 266వ, సాత్విక్ 469వ ర్యాంక్‌లు సాధించారు. విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
దిలావర్‌పూర్: మండల కేంద్రానికి చెందిన పసుల లావణ్య, పవన్ దంపతుల కుమారుడు పసుల అద్విత్ సైనిక్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. శనివారం రాత్రి వెలువడిన ఫలితాల్లో సదరు విద్యార్థి సత్తా చాటాడు. స్థానిక విజేత పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థి నవోదయ, సైనిక్ పరీక్షలకు శిక్షణ తీసుకున్నాడు.

సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ