టోల్ మోత!
● అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు ● జిల్లాలో రెండు టోల్ ప్లాజాలు
చార్జీల పెంపు ఇలా..
గంజాల్ ప్లాజాలో..
కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి : రూ.60 నుంచి రూ.65 కు పెరుగుతుంది.
రిటర్న్ జర్నీ చార్జీ : పెంచలేదు.
పాస్ చార్జీ రూ.2075 నుంచి నుంచి రూ.2145 పెరుగుతుంది.
లైట్ కమర్షియల్ వాహనాలకు...
సింగిల్ ట్రిప్ రూ. 100 నుంచి రూ.105కు..
రిటర్న్ జర్నీ రూ.150 నుంచి రూ.155కు
నెలవారీ పాస్ చార్జీ రూ.3,350 నుంచి రూ.3470..
బస్సు, ట్రక్కులకు
సింగిల్ ట్రిప్ రూ.210 నుంచి రూ.220..
రిటర్న్ జర్నీ రూ.315 నుంచి రూ.325
నెలపాస్ చార్జీ రూ.7,015 నుంచి రూ.7,265కు ..
ఓవర్ సైజ్డ్ వెహికల్స్..
సింగిల్ ట్రిప్ రూ.400 నుంచి రూ.415కు..
రిటర్న్ జర్నీ రూ.605 నుంచి రూ. 625కు..
నెల పాస్ చార్జీ రూ.13,395 నుంచి రూ.13,875కు సవరించారు.
దిలావర్‌పూర్ ప్లాజాలో..
కార్లు, జీపులు..
సింగిల్ జర్నీ చార్జి పెంచలేదు..
రిటర్న్ జర్నీ రూ.77 నుంచి రూ.80కు..
నెల పాస్ రూ.1,675 నుంచి రూ.1735కు..
లైట్ కమర్షియల్ వాహనాలకు
సింగిల్ ట్రిప్ రూ.80 నుంచి రూ.85,
రిటర్న్ జర్నీ రూ.120 నుంచి రూ.125..
నెలపాస్ రూ.2,710 నుంచి రూ.2,805..
బస్సు, ట్రక్కులకు..
సింగిల్ ట్రిప్ రూ.170 నుంచి రూ.175..
రిటర్న్ జర్నీ రూ.255 నుంచి రూ.265
నెలపాస్ రూ.5,675 నుంచి రూ.5,880..
ఓవర్ సైజ్డ్ వెహికల్స్..
సింగిల్ ట్రిప్ రూ.325 నుంచి రూ.335కు..
రిటర్న్ జర్నీ రూ.490 నుంచి రూ.505..
నెల పాస్ చార్జీ రూ.10,835 నుంచి రూ.11,220కు సవరించారు.
నిర్మల్‌చైన్‌గేట్: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. పెరిగిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్‌గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. పలు అంశాల ప్రాతిపదికగా టోల్ ధరలను సవరించారు.
జిల్లాలో రెండు..
జిల్లాలో సోన్ మండలం గంజాల్‌లో ఒకటి, దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఒక టోల్‌ప్లాజా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో గంజాల్ టోల్‌ప్లాజా, భైంసా వెళ్లే మార్గంలో 13 కిలోమీటర్ల దూరంలో దిలావర్‌పూర్ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు.
కనీస సౌకర్యాలు కరువు..
టోల్ చార్జీలను కేంద్రం పెంచింది. నిర్మల్ భైంసా 61వ జాతీయ రహదారిపై దిలావర్‌పూర్ సమీపంలో ఉన్న టోల్‌గేట్ నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై మరింత భారం పడింది. ఈ టోల్ గేట్ ద్వారా నిత్యం రూ.2.38 లక్షల టోల్ వసూలవుతోంది. పెంచిన చార్జీలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రహదారిపై ఎలాంటి నాణ్యతా చర్యలు తీసుకోకున్నా, వేగాన్ని గుర్తించే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకున్నా, టోల్ చార్జీలు పెంచుతూ పోతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


