దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మరువలేనిది
నిర్మల్‌చైన్‌గేట్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మరువలేనిదని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రై తాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య ము ఖ్య భూమిక పోషించారని గుర్తుచేశారు. బడుగు బలహీనవర్గాల హక్కులను కాపాడడం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్, సీపీవో జీవరత్నం, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


