ఇక.. ఎర్లీ బర్డ్..!
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది.
● ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ ● ఈ నెల 30 వరకు గడువు
భైంసాటౌన్: మున్సిపాలిటీల్లో ఆదాయం సమకూర్చుకునేందుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆస్తిపన్ను బకాయిల వసూలు, ముందస్తు చెల్లింపులపై రాయితీ ప్రకటిస్తోంది. ఇటీవల గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. తాజాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ అవకాశం కల్పించింది. ఈనెల 30లోపు చెల్లించినవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5శాతం రాయితీ వర్తిస్తుంది. బకాయిలు ఉన్నవారికి ఇది వర్తించదు.
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను డిమాండ్ ఇలా...
మున్సిపాలిటీ డిమాండ్(రూ.కోట్లలో)
నిర్మల్ 10.77
భైంసా 05.13
ఖానాపూర్ 01.99
సద్వినియోగం చేసుకోవాలి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణ ప్రజలు తమ ఆస్తిపన్నును ఈనెల 30లోగా చెల్లిస్తే డిమాండ్‌పై 5 శాతం రిబేట్ వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత బిల్ కలెక్టర్‌ను సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు. – బి.రాజేశ్ కుమార్,
మున్సిపల్ కమిషనర్, భైంసా


