సిరాల.. ఎన్నేళ్లీ గోస | - | Sakshi
Sakshi News home page

సిరాల.. ఎన్నేళ్లీ గోస

Apr 5 2025 1:47 AM | Updated on Apr 5 2025 1:47 AM

సిరాల

సిరాల.. ఎన్నేళ్లీ గోస

నిర్మల్‌

శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

కల్యాణానికి తలంబ్రాలు

నిర్మల్‌టౌన్‌: శ్రీరామనవమి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాగులవాడ వాల్మీకినగర్‌లోని రామాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి తలంబ్రాలు, మంగళ సూత్రాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యన్నగారి మాధవి, సుజాత, కాలనీ మహిళలు పాల్గొన్నారు.

హారాష్ట్ర సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరాల ప్రాజెక్టు రెండేళల క్రితం వరకు బ్యాక్‌వాటర్‌తో చుట్టుపక్కల గ్రామాలకు జీవనాధారంగా ఉండేది. 1902లో నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు, తానూరు, భైంసా మండలాల్లోని గ్రామాల తాగు, సాగునీటి సమస్యలను దూరం చేసింది. రెండేళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయా యి. అప్పటి నుంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ వేసవిలో తాగునీటికి కూడా రెండు మండలాల ప్రజలు గోస పడుతున్నారు. ప్రాజెక్టు పైభాగంలో మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఝరి, ఝరితండా, బోల్సా, బోరిగాం, ఉమ్రి, బెల్‌తరోడ గ్రామాలతోపాటు, కింది భాగంలోని సిరాల, ఇలేగాం, బడ్‌గాం గ్రా మాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

– భైంసా/భైంసారూరల్‌/తానూరు

పడిపోయిన భూగర్భ జలాలు..

ఒకప్పుడు ఈ గ్రామాల్లో మినీ ట్యాంకులు, నల్లాలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి.ప్రాజెక్టు తెగిన రెండేళ్లలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం మిషన్‌ భగీరథ నీరు మాత్రమే ఆధారంగా మిగిలింది. తానూరు మండలం ఝరి గ్రామంలో ఒక ప్రైవేటు వ్యక్తి ఇంటి బోరు నుంచి నీటిని బిందెల్లో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వేసవిలో ఎండలు మరింత తీవ్రమైతే, నీటి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

పశువులకూ దొరకని నీరు..

పశువులకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రతీ వేసవిలో గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు పెంచే రైతులు ప్రాజెక్టు చుట్టూ వాటిని మేపుతూ, నీటిని తాగించేవారు. ప్రాజెక్టు తెగిపోవడంతో రైతులు తమ పశువులను ఇతర గ్రామాలకు తీసుకెళ్లి నీటిని తాగించాల్సి వస్తోంది. తానూరు మండలంలో ఝరి, బోరిగాం, బోల్సా, బెల్‌తరోడ, బోసి, బోంద్రట్‌, ఉమ్రి, భైంసా మండలంలో సిరా ల, మాంజ్రి, ఇలేగాం వంటి గ్రామాలు సిరాల ప్రా జెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు వద్దకు రైతులు తమ పశువులను తీసుకెళ్లి నీటి అవసరాలను తీర్చేవారు. అయి తే, సిరాల ప్రాజెక్టుతోపాటు చుట్టుపక్కల చెరువులు కూడా తెగిపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, పంట భూముల్లో బోర్లు వట్టిపోయాయి. రైతులు చేసేది లేక, పశువులను గ్రామాల్లోని నీటి తొట్టెలు లేదా ఇళ్ల ముందు ఉన్న బోర్ల వద్దకు తీసుకెళ్లి నీటిని తాగిస్తున్నారు. ఈ పరిస్థితి చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

భక్తుల భద్రత.. గాలిలో దీపమే!

అక్షర జ్ఞానం అందించాలని.. ఆపదలను తొలగించాలని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రత గాలిలో దీపంలాగే మారింది.

8లోu

న్యూస్‌రీల్‌

ఇందిరమ్మ ఇళ్లు

నాణ్యతతో నిర్మించాలి

కుంటాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా చేపట్టాలని డీపీవో, ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్‌ సూచించారు. మండలంలో విఠాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్‌, పంచాయతీ కార్యదర్శి ఉత్తం, ఎఫ్‌ఏ సుదర్శన్‌, కారోబార్‌ లక్ష్మణ్‌ ఉన్నారు.

రెండేళ్ల క్రితం ప్రాజెక్టుకు గండి

అడుగంటిన భూగర్భ జలాలు

ఎడిపోయిన బావులు.. వట్టిపోయిన బోర్లు

తాగునీటికి తండ్లాడుతున్న ప్రజలు, పశువులు

సిరాల.. ఎన్నేళ్లీ గోస 1
1/2

సిరాల.. ఎన్నేళ్లీ గోస

సిరాల.. ఎన్నేళ్లీ గోస 2
2/2

సిరాల.. ఎన్నేళ్లీ గోస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement