‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’

Apr 7 2025 1:18 AM | Updated on Apr 7 2025 1:18 AM

‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’

‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’

ఖానాపూర్‌: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని సీపీఐ ఎంఎల్‌ మా స్‌లైన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఆవరణలో ఈనెల 8వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌పీ చట్టం కోసం రైతులు ఉద్యమిస్తున్నా లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని కార్మికులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో రైతు సమస్యలపై కేంరద్రపభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో రాజన్న, శంకర్‌, లచ్చన్న, భీమలింగు, భీమన్న, రాజు, నాగరాజు, భీంరావు, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement