బీజేపీతోనే దేశాభివృద్ధి
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకురావడం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చి, ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరిని గుర్తు చేసుకోవాలన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, మెడిసెమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తదితరులు పాల్గొన్నారు.


