మాతృమూర్తి దీవెనలతో ప్రవేశాలు
సారంగపూర్: మండలంలోని చించోలి(బీ) ప్రాథమిక పాఠశాలలో మాతృమూర్తుల దీవెనలతో తల్లి తన కన్నబిడ్డను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించే కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేశ్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉద యం 8గంటల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించడంతో పాటు నూ తనంగా పాఠశాలలో ప్రవేశాలు కల్పించనున్న వి ద్యార్థుల వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈపాఠశాలలో చదువుకుని అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడ్డ, ఎందుకు వెనుకబడ్డామో.. అనే వివరాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి ఇదివరకు ఇక్కడ చదుకువున్న విద్యార్థుల ప్రతిభను పోషకుల ముందు ప్రదర్శించారు. ఇది చూసిన గ్రామస్తులు పిల్ల లను అధికసంఖ్యలో పాఠశాలలో చేర్పించేందుకు ముందుకువచ్చారు. పాఠశాలలో ప్రవేశాలు పెంచేందుకు సరికొత్త ఆలోచన చేసిన ప్రధానోపాధ్యాయుడు గణేశ్‌ను గ్రామస్తులు, సిబ్బంది, నాయకులు అభినందించారు. త్వరలోనే ప్రైవేట్ పాఠఽశాలకు దీటుగా తాను పనిచేసే పాఠశాలను తీర్చిదిద్దుతానని సదరు హెచ్‌ఎం గణేశ్ చెప్పారు.


