
జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గుతాయి
భైంసాటౌన్: కేంద్రం తెస్తున్న జీఎస్టీ సంస్కరణలతో అనేక వస్తువుల ధరలు తగ్గుతాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. వ్యవసా య యంత్ర పరికరాలు, విత్తనాలు, ఇతర వస్తువులపై కేంద్రం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిందని పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి శుక్రవారం పాలా భిషేకం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే పలు వస్తువులపై జీఎస్టీని తగ్గించిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయినాథ్, గంగాధర్, సుష్మ, భీంరావ్, చిన్నారెడ్డి, రాకేశ్, భూమేష్, పండిత్ తదితరులు
పాల్గొన్నారు.
తైబజార్ టెండర్ రద్దు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలో తైబజార్‌తో చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కలెక్టర్, అదనపు కలెక్టర్లతో మాట్లాడి టెండర్ రద్దు చేయాలని ఆదేశించారు. ఇకపై పట్టణంలోని చిన్న వ్యాపారులు వ్యాపార నిర్వహణకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.