
వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన
నిర్మల్‌టౌన్: వేతనాలు చెల్లించాలని నిర్మల్ మున్సిపల్ కార్మికులు సోమవారం ఉదయం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పూట గడువడం కష్టంగా మారిందని, పిల్లల ఫీజులు, చెల్లించలేక నిత్యావసర సరుకులు కొనుగోలు కష్టమవుతుందన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రెండు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే విధుల్లో చేరమని స్పష్టం చేశారు. కార్మికులతో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.