పన్నెండు మందికి ఎక్స్‌గ్రేషియా మంజూరు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ: గల్ఫ్‌లో మృతి చెందిన నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరైనట్లు రూరల్ ఎమ్మెల్యే రేకుల్‌పల్లి భూపతిరెడ్డి తెలిపారు. సిరికొండ మండలంలోని రావుట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో నియోజకవర్గానికి చెందిన 15 వేల ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. అక్కడ అసువులు బాసిన మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినట్లుగా నష్టపరిహారం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చెప్పినట్లుగా గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి పాటుపడకుండా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిధుల గురించి ప్రధానిని నిలదీయాలని, తెలంగాణ అభివృద్ధికి నిధుల కోసం పార్లమెంట్ ఎదుట ధర్నా చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, చందర్‌నాయక్, బాకారం రవి, రాజారెడ్డి, గంగాధర్, సంతోష్, మల్లేశ్‌యాదవ్, సామే ల్, సంతోష్‌నాయక్, రమేశ్, ప్రసాద్, లింగం, శ్రీనివాస్, బడాల మహిపాల్, గంగారెడ్డి, దాసు, భాస్కర్, బన్నాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment