దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి
ఖలీల్‌వాడి: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. 1999లో మహదేవపూర్ మండలం అన్నారంలో నక్సలైట్లు ఆయనను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన నాడు రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(ఏఆర్) రాంచందర్ రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, ఆర్‌ఐ(వెల్ఫేర్) శ్రీనివాస్, పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
వ్యక్తి నిర్మాణ కర్మాగారమే సంఘ శాఖ
● ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ భౌతిక్ ప్రముఖ్
కృష్ణశాస్త్రి విజయభాస్కర్
సుభాష్‌నగర్: హిందూ సమాజంలోని వ్యక్తుల్లో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా, సమాజ సంరక్షకులుగా తయారు చేసే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ భౌతిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ పేర్కొన్నారు. కోటగల్లిలోని పద్మశాలీ హైస్కూల్‌లో పరుశురామ ప్రభాత్ శాఖ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తల వికాసానికి సంఘ శాఖ తోడ్పాటునందిస్తుందని, శాఖ ద్వారా స్వయంసేవకుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఏర్పడతాయని తెలిపారు. ఆటాపాటల వ్యక్తిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడమే సంఘ శాఖ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. విత్తనం మహావృక్షంగా మారినట్లే, సంఘ శాఖ కూడా హిందూ సమాజానికి పునాది రాయి లాంటిదని, సంఘ శాఖల ద్వారానే హిందూ సమాజం చైతన్యవంతమైందని తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు నిర్వహించిన సంచలన్, శారీరక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహ కార్యవాహలు సుమిత్, వెంకటేశ్, భద్రయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి
Comments
Please login to add a commentAdd a comment