క్రైం కార్నర్
మూడు ఇళ్లలో చోరీ
తాడ్వాయి: మండల కేంద్రంతోపాటు బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి తాళం వేసిన మూడు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయికి చెందిన బాయికాడి శరత్ శనివారం తన ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఇంటికి తాళం ఉండడంతో దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రూ. ఐదు వేల నగదు, నాలుగున్నర తులాల బంగారం, పది తులాల వెండిపట్ట గొలుసులు చోరీకి గురయ్యాయి. అదేవిధంగా పక్కనే ఉన్న గడ్డల సావిత్రి ఇంటికి సైతం తాళం వేసి ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 18వేల నగదు, మూడు మాసాల బంగారు మాటీలు, రెండుమాసాల ఉంగరం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. తాడ్వాయికి చెందిన సుర్కంటి ప్రతాపరెడ్డి తనబైక్‌ను ప్రతిరోజు మాదిరిగానే తన ఇంటి ఎదుట రాత్రి ఉంచి పడుకున్నాడు. ఉదయం లేచి చూసే సరికి దుండగులు బైక్‌ను దొంగిలించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కుర్మతిరుపతికి చెందిన ఇంట్లో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. రూ. 18లక్షల నగదును చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment