డిచ్‌పల్లి: ప్రభుత్వం జీపీ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూనియన్ల విలీన సభకు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు, విలీన సభ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆకుల పాపయ్య, యాదయ్య, శివబాబు, భూమన్న, శ్యాంసన్, వెంకన్న, సాయినాథ్, అబ్దుల్, గంగాధర్, కార్తిక్, నర్సిరెడ్డి, పోశెట్టి, జీపీ, కార్మికులు పాల్గొన్నారు.


