రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ లక్ష్యం
మోపాల్: భారతదేశ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అందించే లక్ష్యంతో ముందుకెళ్తుందని టీపీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మోపా ల్ మండలం కులాస్‌పూర్, చిన్నాపూర్, బాడ్సి గ్రామాల్లో కాంగ్రెస్ జాతీయ నాయకత్వ సూచనల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ పాదయాత్ర నిర్వహించారు. గ్రామాల్లో అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాడ్సి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. కార్య క్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, చిన్నాపూర్ పోశెట్టి, దిలావర్ హుస్సేన్, ఆకుతోట సాయన్న, లక్ష్మారెడ్డి, ఈరమ్మ జగదీశ్, రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.


