వీకెండ్ డాక్టర్లు!?
కంటి వైద్య నిపుణుడు కృష్ణమూర్తి మూడు రోజులపాటు అందుబాటులో లేకున్నా ఆయనకు చెందిన శ్రీరామ, గిరిజ నేత్ర వైద్యశాలల్లో రోగులకు ఏ ఆటంకం లేకుండా చికిత్స కొనసాగింది. కాంపౌండర్లే ఒక్కో రోగి వద్ద రూ.350కిపైగా వసూలు చేస్తూ టెస్టులు రాస్తూ వైద్యం అందిస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం రాత్రి వైద్యారోగ్యశాఖ అధికారులు రెండు ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు.
నవీపేట్ మండలం నాళేశ్వర్‌కు చెందిన లక్ష్మి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 30వ తేదీన నగరంలోని ఖలీల్‌వాడిలో ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకున్నా కాంపౌండర్‌లు రూ.400 ఫీజు వసూలు చేసి, తాను సూచించిన టెస్టులు చేయించుకుని రావాలని చీటీ ఇవ్వడంతో ఆమె విస్తుపోయింది. డాక్టర్ చూడకుండానే టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలని ప్రశ్నించగా, ఆమెను బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. దీనిపై లక్ష్మితోపాటు ఆమె కుటుంబ సభ్యులు వైద్యారోగ్యశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కాంపౌండర్‌కు కాదేదీ అసాధ్యం!
డాక్టర్లు స్థానికంగా లేనిసమయంలో అంతా వారే..
సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న వైనం


