కమనీయం.. రాములోరి కల్యాణం
సాక్షి నెట్‌వర్క్: శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. నగరంలోని ఖిల్లా రామాల యం, సుభాష్‌నగర్ రామాలయం, న్యాల్‌కల్ రోడ్డు లో ఉన్న అయోధ్యనగర్ కోదండ రామాలయం, ఆర్యనగర్ రామాలయం, జెండా బాలాజీ ఆలయం, మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయం, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల క్షేత్రంలో, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సాయిబాబా జన్మదినం సందర్భంగా మాధవనగర్‌లోని సాయి బాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశా రు. డిచ్‌పల్లి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ మండలా ల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామాలయాల్లో ఘనంగా
శ్రీరామ నవమి వేడుకలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కమనీయం.. రాములోరి కల్యాణం
కమనీయం.. రాములోరి కల్యాణం
కమనీయం.. రాములోరి కల్యాణం
కమనీయం.. రాములోరి కల్యాణం


