వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య | - | Sakshi

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య

Apr 11 2025 1:25 AM | Updated on Apr 11 2025 1:25 AM

వేర్వ

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య

వేల్పూర్‌: మండలంలోని మోతె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సంజీవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ప్రియాంక(25)కు మోతె గ్రామానికి చెందిన కల్ల భాస్కర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతోపాటు అత్తమామలు తరచూ ఆమెను వేధించేవారు. గురువారం ఉదయం భర్త, అత్తా, మామ ఆమెతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రియాంక తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి నడ్పిసాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎల్లారెడ్డి మండలంలో..

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని లక్ష్మాపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మ హేష్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు (35) మద్యానికి బానిసై గురు వా రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

భిక్కనూరు మండలంలో..

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోచమ్మల నర్సింలు (45) కుటుంబ కలహాలతో విరక్తి చెందాడు. ఈక్రమంలో గురువారం వేకువజామున అతడు తన బంగ్లా పైనుంచి విద్యుత్తు స్తంభం ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

సిరికొండ మండలంలో..

సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రామ్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మలావత్‌ అన్వేష్‌ (26) సిరికొండలో ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి మదన్‌లాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాలుడి ఆత్మహత్యాయత్నం

రాజంపేట: మండ ల కేంద్రంలో ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేటకు చెందిన కడమంచి స్వామి కుమారుడు శ్రీహరి(17) రూ. 30వేల మొబైల్‌ ఫోన్‌ కొనివ్వాలని ఇంట్లో గొడవ పడ్డాడు. అంత ఖరీదైన మొబైల్‌ కొనే స్థోమత లేదంటూ తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీహరి గురువారం ఎలుకలు మందు(బిస్కెట్లు) తిన్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య 1
1/1

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement