
పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ 1, 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ టీ సంపత్, పీఆర్‌వో ఏ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ www.telanganauniversity.ac. inలో పొందుపర్చినట్లు కంట్రోలర్ తెలిపారు.
కీ బోర్డులో గిన్నిస్ రికార్డు
నిజామాబాద్‌నాగారం: జిల్లాకు చెందిన సుభాష్‌చంద్రబోస్ కీ బోర్డు ప్లేయింగ్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. విజయవాడ కీ బోర్డు ప్లేయింగ్ అండర్ హెల్ మ్యూజిక్ స్కూల్ ఈ నెల 14న నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఈ ఘనత సాధించారు. సుభాష్ చంద్రబోస్ జిల్లాలో ఎంపీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అంతర్జాతీయ వర్క్‌షాప్‌కు తెయూ అధ్యాపకుడికి ఆహ్వానం
తెయూ(డిచ్‌పల్లి): దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్‌డబ్ల్యూపీఎల్) సంస్థ ‘పాత్రికేయ విద్య’ అనే అంశంపై నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ యూనివర్సిటీ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్‌కు ఆహ్వానం పంపింది. వివిధ దేశాల నుంచి పలువురు ఆచార్యులు పాల్గొనే ఈ వర్క్‌షాప్ ఈ నెల 17న జరుగనుంది. వారం రోజుల ముందే ఈ ఆహ్వానం అందడంతో సమయాభావంతో సియోల్ వరకు రాలేనని, ఆన్‌లైన్‌లో హాజరై ప్రసంగించేందుకు అనుమతించాలని చంద్రశేఖర్ సంస్థ నిర్వాహకులను కోరారు. దీనికి ఆ సంస్థ ఆమోదం తెలుపడంతో ఈ నెల 17న సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరిగే వర్క్‌షాప్‌లో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆన్‌లైన్‌లో హాజరై ప్రసంగించనున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌రూరల్: జెండా బాలాజీ దేవ స్థానంలో ధర్మకర్తలుగా సేవలందించేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 22వ తేదీ వరకు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.

పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల