కాంగ్రెస్‌పై భ్రమలు తొలగిపోయాయి
వేల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, అందుకే తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం సోన్‌పేట్ మాజీ సర్పంచ్ గోలిప్రకాశ్, దూదిగాం మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్, వారి అనుచరులు వేల్పూర్‌లో మంగళవారం వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని మోతె, బుస్సాపూర్ లాంటి అనేక గ్రామాలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ఉద్యమానికి అండగా నిలబడ్డాయన్నారు. కేసీఆర్ వెంట తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్‌రెడ్డి ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి నడిచారని గుర్తుచేశారు. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణాను అనేక రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కమలాకర్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, మాజీ సర్పంచులు నర్సయ్య, గంగారెడ్డి, రాజారెడ్డి, గంగారెడ్డి, యాదగిరిగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి


