హమాలీల కొరతతో ఇబ్బందులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ఈ సీజన్‌లో సుమారు 240 కేంద్రాలను ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలకు కేటాయించింది. మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు ఆలస్యం కావడంతో హమాలీలు, ఇతరాత్ర ఏర్పాట్లలోనూ జాప్యం జరిగింది. సొసైటీలు ఎప్పటిలాగే వారికి కేటాయించిన కేంద్రాల అవసరాలకు అనుగుణంగా హమాలీలకు దళారుల ద్వారా అడ్వాన్సులు చెల్లించి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. నేటికీ హమాలీల కొరత కారణంగా అనేక కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగడం లేదని పౌరసరఫరాలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.


