ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండడంతో ఆనందానికి దూరమవుతున్నారని, ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన లక్కారం తవ్వన్న ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పొద్దుటూరి వినయ్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సవిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, మారుతిరెడ్డి, రవిగౌడ్, కాశీరాం, కొంతం మురళీధర్ తదితరులు ఉన్నారు.


