ఇసుక చల్లడంతోనే వివాదం ముదిరిందా..?
మోర్తాడ్: భీమ్‌గల్‌లో పోలీసులు లాఠీచార్జీ చేయడానికి కొందరు వ్యక్తులు ఇసుక చల్లడమే కారణమని తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి తన వాహనం ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై ఇసుక చల్లి కనిపించకుండా చేయడంతో స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలిసింది. ఇసుక చల్లిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు వీడియోలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇసుకను చల్లి పోలీసులకు కనిపించకుండా చేయడం ద్వారా మంత్రి కాన్వాయ్‌కు ఏదైనా హాని తలపెట్టాలని చూశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కావాలనే ఉద్రిక్తతలను సృష్టించేందుకు ఇసుక చల్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు.


