న్యాయవాదుల సహకారం మరువలేనిది
మాట్లాడుతున్న జిల్లా జడ్జి సునీత కుంచాల
ఖలీల్‌వాడి : కోర్టులో న్యాయవాదుల సహకారం మరువలేనిదని జిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జడ్జి మాట్లాడారు. మూడున్నరేళ్ల పదవీకాలంలో న్యాయాన్ని కక్షిదారులకు అందించడంలో న్యాయ వాదుల సహకారం వెలకట్టలేనిదన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల లక్ష్యం కక్షిదారులకు న్యాయసేవలు త్వరితగతిన అందించడమేనని అ న్నారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ఆత్మరక్షణ కోసం ఇప్పించిన తైక్వాండో శిక్షణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం నిజామాబాద్ మహిళా లోకపు చైతన్యశీలికి దక్కిన అరుదైన గౌరవంగా ఆమె అభివర్ణించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయిరెడ్డి మాట్లాడు తూ బార్ అండ్ బెంచ్ సమన్వయంతో మెరుగైన న్యాయ ఫలితాలు కక్షిదారులకు అందించడంలో ముందుభాగాన నిలిచామన్నారు. అనంతరం జిల్లా జడ్జి సునీతను ఘనంగా సన్మానించారు. బార్ ప్ర ధాన కార్యదర్శి మాణిక్ రాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షు లు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్, రమేశ్, కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ రావు, కిరణ్‌కుమార్ గౌడ్, మాజీ పీపీ మధు సూదన్ రావు, టక్కర్ హన్మంత్ రెడ్డి, అజార్ కిషన్ రావు, వీ భాస్కర్, పరుచూరి శ్రీధర్ పాల్గొన్నారు.
వీడ్కోలు సమావేశంలో
జిల్లా జడ్జి సునీత కుంచాల


