జోరు పెంచిన బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

జోరు పెంచిన బీఆర్‌ఎస్‌

Apr 18 2025 1:47 AM | Updated on Apr 18 2025 1:47 AM

జోరు పెంచిన బీఆర్‌ఎస్‌

జోరు పెంచిన బీఆర్‌ఎస్‌

భీమ్‌గల్‌లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం

ప్రజాసమస్యలపై పోరాటానికి తగ్గేదే లేదంటున్న గులాబీ శ్రేణులు

రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ అధ్యయన కమిటీ సభకు లభించిన స్పందన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఎన్నికల సమ యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు ఎక్కడంటూ గులాబీ పార్టీ నిలదీతలను జిల్లా లో ఉధృతం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి 16 నెలలు గడిచినప్పటికీ హామీలను అమ లు చేసే విషయంలో ఏమీ పట్టనట్లు ఉంటు న్నారంటూ బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. జిల్లాలో బా ల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ప్రజాసమస్యల విషయమై కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రజా సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ స్పీడ్‌ పెంచా రు. రైతుల ఆత్మహత్యలపై గత జనవరిలో బీ ఆర్‌ఎస్‌ అధ్యయన కమిటీ వచ్చిన నేపథ్యంలో మెండోరా మండలం బుస్సాపూర్‌లో నిర్వహించిన సభకు రైతుల నుంచి భారీ స్పందన వ చ్చింది. రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంటే రేవంత్‌ సర్కార్‌ సోయిలేకుండా వ్యవహరిస్తోందని ఆ సభలో బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పోరుబాట పట్టిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు యాక్టివ్‌ అవుతున్నాయి. నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలో వరుసగా రైతు రుణమాఫీ, ఎల్‌ఆర్‌ఎస్‌, ధాన్యం బోనస్‌, రైతుబంధు అమ లు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీక్షాదివస్‌నూ నిర్వహించి కార్యకర్తలను ముందుకు నడిపించారు.

కాంగ్రెస్‌ హామీలపై రగడ..

బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌లో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో హామీల విషయ మై రగడ నెలకొంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హామీలను ప్రస్తావించా రు. తులం బంగారం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు, కౌలు రైతులకు రూ.15 వేలు, భూ మిలేని నిరుపేదలకు రూ.12 వేలు, పోడు ప ట్టాలు, అమరుల తల్లిదండ్రులకు రూ.25 వేల పింఛన్‌, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ తదితర హామీలను ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. ఆడబిడ్డలు హామీల గురించి అడుగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పాలని వేముల అన్నారు. దీంతో మంత్రి జూపల్లి స్పందిస్తూ గత పదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అ ప్పులపాలైందని, వడ్డీలు కట్టడానికే సరిపోతోందని కౌంటర్‌ ఇచ్చారు. అప్పులు రహస్యంగా చేయరని, బడ్జెట్‌లో ప్రకటించే చేస్తారని, అప్పుల పేరు చెప్పి హామీల అమలును గాలికొదిలేయడం సరికాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీతలు

హామీల అమలు ఎక్కడ? : ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి

గత ప్రభుత్వంలో అప్పులయ్యాయి : మంత్రి జూపల్లి

కార్యకర్తల్లో ఊపు..

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం భీమ్‌గల్‌ సభలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. తు లం బంగారం ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో పోలీసులు అనూ హ్యంగా లాఠీచార్జి చేశారు. దీంతో ఎమ్మె ల్యే ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ, ఇకపై ప్రజల పక్షాన పోరు మరింత ఉధృతం చేస్తామంటూ ప్రశాంత్‌రెడ్డి ప్రకటించడంతో కార్యకర్తల్లో మరింత ఊపు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement