తెయూలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం హనుమాన్ జన్మోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అంతకుముందు క్యాంపస్ ఆవరణలోని హనుమాన్ ఆలయం వద్ద రిజిస్ట్రార్ యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్ కనకయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం నిర్వహించిన శోభాయాత్రలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతబట్టి నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్, అశోక్, సభ్యులు అక్షయ్, మనోజ్, శివ, వినోద్, సంతోష్, రాకేష్, సాయినాథ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
తెయూలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర


