చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి
తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భారత మహిళల కబడ్డీ టీం ప్రధాన కోచ్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. తెయూ క్యాంపస్‌లో మంగళవారం నిర్వహించిన యూనివర్సిటీ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చన్నారు. వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యూనివర్సిటీల్లో ఎంతో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, డైరెక్టర్ కల్చరల్ అండ్ యూత్‌సెల్ డైరెక్టర్ లావణ్య, ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి, యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కనకయ్య, సీహెచ్‌ఆరతి, స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, విద్యావర్థిని, పీఆర్‌వో పున్నయ్య, ఏఈ వినోద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి


