
అవార్డులందుకున్న ఉత్తమ ‘గురువులు’
తెయూ(డిచ్‌పల్లి)/ నిజామాబాద్ రూరల్: అవార్డు లు మరింత బాధ్యతను పెంచుతాయని రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ప్రొఫెసర్ గోపిశెట్టి రాంబాబు, సీహెచ్ శంకర్, రా ఘవపురం గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైద రాబాద్‌లో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో వారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చేతుల మీదు గా అవార్డులను అందుకున్నారు. అధికారులు అవార్డుతోపాటు శాలువా, మెమోంటో, పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రోత్సహకంగా నగదు పారితోషికాన్ని అందజేశారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ విద్యాశాఖ ఉత్తమమైన ఫలితాలు సాధించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. అవార్డులు అందుకున్న ప్రొఫెసర్ రాంబాబుకు తెలంగాణ వ ర్సిటీలోని వివిధ విభాగాల హెచ్‌వోడీలు, డైరెక్టర్లు, వర్సిటీ టీచర్స్ అసిసోయేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సీహెచ్ శంకర్, ఆర్ గోపాలకృష్ణలను ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.

అవార్డులందుకున్న ఉత్తమ ‘గురువులు’

అవార్డులందుకున్న ఉత్తమ ‘గురువులు’