నేడు జిల్లాకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ రాక

Sep 6 2025 4:39 AM | Updated on Sep 6 2025 4:39 AM

నేడు

నేడు జిల్లాకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ రాక

లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

నిజామాబాద్‌ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొ మ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ శనివారం జి ల్లాకు రానున్నారు. వి నాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని దుబ్బలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి వినాయకుడికి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభిస్తారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ కేశ వేణు తెలిపారు.

నేడు వైన్స్‌ షాపులు బంద్‌

ఖలీల్‌వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వైన్స్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు బంద్‌ చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 6 నుంచి ఆ దివారం సాయంత్రం 4 గంటల వరకు దు కాణాలను మూసి ఉంచాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మోర్తాడ్‌: భీమ్‌గల్‌ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నా రు. ఆలయ ధర్మకర్తలు నంబి పార్థసారథి, వాసు పంతులు వారికి ఘన స్వాగతం పలి కారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ప్రవీణ్‌రావుకు, ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎ స్సై సుభాష్‌ బందోబస్తును నిర్వహించారు.

హత్య కేసులో

నిందితుల రిమాండ్‌

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని మామిడిపల్లిలో ఇటీవల జరిగిన వృద్ధుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ శుక్రవారం తెలిపారు. కామారెడ్డికి చెందిన అంగర లక్ష్మి, భర్త వేణుకుమార్‌తో కలిసి మామిడిపల్లిలో నివాసం ఉంటున్నారు. కా గా మోర్తాడ్‌ మండలం సుంకెట్‌ గ్రామానికి చెందిన పోతు నరేందర్‌ (65) మామిడిపల్లిలోని వీరి నివాసానికి తరచూ వస్తుండేవాడు. గత నెల 20న నరేందర్‌ వారి ఇంటికి వెళ్లగా, లక్ష్మి, ఆమె భర్త వేణుకుమార్‌, అల్లుడు రాజశేఖర్‌, కొడుకు నవీన్‌, కుమార్తె నవ్య కలిసి హత్యచేశారు. నరేందర్‌పై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను కాజేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా మామిడిపల్లి వద్ద నిజాంసాగర్‌ కెనాల్‌లో వదిలేశారు. మోర్తాడ్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులైన లక్ష్మి, అల్లుడు రాజశేఖర్‌, కుమారుడు నవీన్‌ పట్టుబడ్డారు. కాగా, వేణుకుమార్‌, నవ్య పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

నేడు జిల్లాకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ రాక 1
1/1

నేడు జిల్లాకు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement