
ప్రజా సంక్షేమమే ధ్యేయం
పెర్కిట్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రా ష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. అంకాపూర్‌లోని రాజారాంనగర్ కాలనీలో నూతనంగా మంజూరైన చౌక ధరల దుకాణాన్ని మార గంగా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. త్వరలో ఇందిర మ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చే యనున్నట్లు వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ డైరెక్టర్ అమృత్ రావు, వీడీసీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, ఎంసీ గంగారెడ్డి, మురళీ, గోపాల్, సృజన్, శృంగారం నర్సయ్య, కిషన్, భూమేశ్ పాల్గొన్నారు.