
జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌లో ప్రతిభ
సుభాష్‌నగర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి విద్యుత్ బాడ్మింటన్ పోటీల్లో ఓపెన్ డబుల్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాకు చెందిన ఇంజినీర్ బి కృష్ణకాంత్‌ను ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ మంగళవారం సన్మానించారు. అలాగే వరంగల్‌లో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, చెస్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు ఈవెంట్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో బి కృష్ణకాంత్ (బషీరాబాద్) ద్వితీయ స్థానం, డబుల్ విభాగంలో శివతేజ రెడ్డి (తాడ్వాయి) ద్వితీయ స్థానం సాధించారు. టీమ్ ఈవెంట్ విభాగంలో రూప్‌సాయి, ప్రశాంత్ జట్టులో కీలకపాత్ర పోషించి తృతీయస్థానంలో నిలిచేలా ప్రతిభ కనబర్చడంతో ఎస్‌ఈ అభినందించారు. కార్యక్రమంలో డీఈ వెంకటరమణ, ఏఏవో గంగారాం, జేఏఓ సురేశ్‌కుమార్, పోశెట్టి, గోపి, రఘువీర్, క్రీడాకారులు పాల్గొన్నారు.