నిజామాబాద్ రూరల్: నగర శివా రులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యా న్ని పట్టుకొని సీజ్ చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా చించోలి నుంచి జిల్లా కేంద్రానికి అక్రమంగా తీసుకొస్తున్న రేషన్ బియ్యాన్ని నగర శివారులోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బాన్సువాడలో..
బాన్సువాడ: బాన్సువాడ నుంచి కోటగిరికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన ఎస్‌కే వహీద్ అనే వ్యక్తి బొలోరే వాహనంలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా బీర్కూర్ చౌరస్తా వద్ద పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై మోహన్ శనివారం తెలిపారు. ఈ విషయమై డీటీ షెర్పొద్దీన్ విచారణ చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వహీద్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత


