రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వర్ని: మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్, జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించగా వెంటనే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


