మాయమాటలకు మోసపోవద్దు
పెర్కిట్(ఆర్మూర్): రైతులు ప్రైవేటు విత్తన కంపెనీల మాయమాటలకు మోసపోకుండా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందజేసే విత్తనాలను వినియోగించాలని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. ఆర్మూర్, ఆలూర్ మండలంలో శనివారం ఆయన పర్యటించారు. మంథనిలో రైతులతో మాట్లాడుతూ అధిక ధరలు చెల్లించి ప్రైవేటు కంపెనీల నుంచి నాసిరకం విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ అందజేసే నాణ్యమైన, ధ్రువీకరణ విత్తనాలతో పంటల్లో వ్యాధి నిరోధకత పెరగడంతో పాటు దిగుబడులు పెరుగుతాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ శ్రీనివాస్ రెడ్డి, ఏవో హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, నాయకులు వైస్ మల్లారెడ్డి, ములాకిడి శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం భోజారెడ్డి, దేగాం శ్రీనివాస్‌గౌడ్, గంగారెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


