Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Chittoor Bangarupalyam Tour Live Updates1
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్‌ జగన్‌

సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్‌ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్‌ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్‌ జగన్‌బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్‌ జగన్‌జనసందోహంగా మారిన మార్కెట్‌ యార్డ్‌. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్‌ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్‌ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్‌ జగన్‌ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌.పోలీసుల లాఠీచార్జ్‌లో​ కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యక‍ర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు. వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్‌ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్‌ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్‌ జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ‍ప్రజలు తెలిపారు వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్‌పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్‌ జగన్‌ కాసేపట్లో మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌కూటమి సర్కార్‌ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్‌ జగన్‌ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్‌ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్‌ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్‌ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కాసేపట్లో మామిడి మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ చెక్‌పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్‌బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్‌..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపా­ళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మంది, మార్కెట్‌ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా... వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

Telangana CM Revanth Reddy Challange KCR Farmhouse Debate2
కేసీఆర్‌ ఒప్పుకుంటే ఫామ్‌హౌజ్‌లోనే మాక్‌ అసెంబ్లీ: సీఎం రేవంత్‌

నేనెవరికీ చాలెంజ్‌లు విసరలేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని మాత్రమే పిలిచాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయితీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి అంటూ సీఎం రేవంత్‌ సెటైర్లు సంధించారు. హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న సవాళ్ల పర్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు కేసీఆర్‌ను సభను రమ్మనే తాను సూచించానని, తానెవరికీ సవాళ్లు విసరలేదని అన్నారాయన. బుధవారం ప్రగతి భవన్‌లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏండ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖను చూశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు దొరక్కపోతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌కు నేనేం సవాల్ విసరలేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చట్ట సభల్లో చర్చ జరుపుదాం.. రండి అని అన్నాను అంతే. 👉కేసీఆర్‌ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతాను. ప్రాజెక్టుల పై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల పై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దాం. అసెంబ్లీ స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాస్తే చర్చకు మేము సిద్ధం. మీరు పదేళ్లలో చేసింది.. ఏడాదిన్నర కాలంలో మేము చేసింది ఏంటో చర్చ పెడదాం. సభలో ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా బాధ్యత నేను తీసుకుంటా. సభ ప్రశాంతంగా జరిపేలా నేను చూసుకుంటా. కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే స్వీకరిస్తాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.👉కేసీఆర్ మా సవాళ్లను స్వీకరించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపుతాం. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతాం. కేసీఆర్ పిలిస్తే నేను సైతం ఫామ్ హౌస్‌కు వస్తాను. డేట్‌, ప్లేస్‌ మీరు చెప్పినా సరే.. మేమైనా చెప్తాం. కానీ, క్లబ్ లు, పబ్‌లు అంటే మాకు కష్టం. గతంలో ఎన్నో చాలెంజ్‌లు చేశాం. కానీ, క్లబ్బులు, పబ్బుల కల్చర్‌కు నేను దూరం. నన్ను పిలవొద్దు. 👉ప్రజా భవన్ లో మీటింగ్ పెట్టినా BRS ఒప్పుకోవడం లేదు. ప్రజా భవన్ లో ఎలా పెడతారు? అని హరీష్ రావు అంటున్నారు. ప్రజా భవన్ ప్రజల కోసమే ఉంది..అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయతీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి. 👉స్టేక్ ఓల్డర్లతో త్వరలో PPT పెడతాం. ఏపీ సీఎంకు సూచనలు చేస్తున్న. వరద జలాల్లో లెక్కలు తేల్చుకుందాం. వరద జలాల లెక్కలు తేల్చిన తరువాత పైన మేము కట్టుకుంటాం..కింద మీరు కట్టుకోండి. మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా మిగులు జలాలు అంటే ఎలా?. నికర, మిగులు జలాల పై కేంద్రం వద్ద చర్చ జరుపుకుందాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోం. మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వడానికి. కృష్ణా, గోదావరి జలాల కోసం కోట్లాడుతాం. కృష్ణా, గోదావరి జలాల పై తెలంగాణను తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదురిస్తాం.👉కొంతమంది పేరును ప్రస్తావించినా నా స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది. బేసిన్లు భేషజాలు లేవని.. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు లేదు. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే.. కేసీఆర్ ఆయన్ను అవమానించారు. రెండు టీఎంసీ లు ఉన్న పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీ కేసీఆర్ తగ్గించారు. కృష్ణాజలాల పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. 👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లను ఏపీ తీసుకుపోతోంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టను కేసీఆర్ ఎందుకు తొలగించారు?. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షలు, నల్గొండ తో కలిపి ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కేసీఆర్ తొలగించారు. కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ కు ఎందుకు తేలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అనాడు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తెస్తానని టెండర్లు పిలిస్తే.. కేసీఆర్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ? అలాంటప్పుడు బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ ఎలా చెప్తారు?. వాస్తవాలు చర్చ జరుపుదాం అంటే కేసీఆర్ రావడం లేదు అని రేవంత్‌ మండిపడ్డారు.

Amit Shah Interesting Comments On Political Retirement Plans3
పొలిటికల్‌ రిటైర్మెంట్‌.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్‌ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్‌ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్‌ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్‌ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు. సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్‌ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది. అమిత్‌ షా రాజకీయ ప్రస్థానం.. 1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్‌లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్‌పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్‌సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్‌ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు.

Who is Linda Yaccarino steps down as CEO of Elon Musk X Details4
మస్క్‌కు బిగ్‌ షాక్‌.. ‘ఎక్స్‌’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ‘ఎక్స్‌’ (అంతకముందు ట్విటర్‌) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్‌’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏. When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్‌) అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్‌ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Shubman Gill Needs 225 Runs In 3rd Test To Break 95-Year-Old Record5
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వ‌ర‌ల్డ్ రికార్డుపై గిల్ గురి

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా శబ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. లీడ్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో సెంచ‌రీతో చెల‌రేగిన గిల్‌.. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో విధ్వంస‌క‌ర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా శ‌త‌క్కొట్టాడు.త‌ద్వారా ఓ టెస్టు మ్యాచ్‌లోఅత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో భార‌త్ 336 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌డంలో గిల్ త‌న ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌నతో కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదిక‌గా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా స‌త్తాచాటాల‌ని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్ర‌మంలో గిల్‌ను ప‌లు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.95 ఏళ్ల రికార్డుపై క‌న్ను..ఈ మ్యాచ్‌లో గిల్ 225 ప‌రుగులు చేయ‌గ‌లిగితే.. ఒక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్‌పై 810 ప‌రుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే కేవ‌లం రెండు మ్యాచ్‌ల‌లోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అవ్వ‌క‌పోయినా మిగిలిన మ్యాచ్‌లోనైనా క‌చ్చితంగా గిల్ అధిగ‌మిస్తాడు.గ‌వాస్క‌ర్ రికార్డుపై గురి..అదేవిధంగా ఒక‌ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గ‌జం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో మూడు సెంచ‌రీలు చేయ‌గా.. మ‌రో రెండు చేస్తే వాల్కాట్ స‌ర‌స‌న నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్​లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్​గానూ శుబ్‌మ‌న్ నిలుస్తాడు. ఈ జాబితాలో భార‌త‌ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs ENG: రెండేళ్ల‌గా జ‌ట్టుకు దూరం.. క‌ట్ చేస్తే! స‌డ‌న్‌గా భార‌త జ‌ట్టుతో ప్రాక్టీస్‌

HCA President Jagan Mohan Rao Arrested Full Details6
హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌రావు అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) వివాదంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్‌ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్‌ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్‌ సీజన్‌లో హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ హోదాలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీని జగన్‌మోహన్‌రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్‌ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్‌ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్‌ఆర్‌ఎస్‌ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్‌ సందర్భంగా వీఐపీ కార్పొరేట్‌ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్‌ తిన్న ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం.. హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్‌ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్‌ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది.

Star Hero who Famous Of hair Cut Latest Pic Goes Viral In Social Media7
ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్‌ కట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్‌ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్‌నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్‌లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్‌ల ముందైనా హీరోల హెయిర్‌ కట్స్‌తోనే పోస్టర్స్‌ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్‌ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్‌ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్‌ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ ‍కట్‌ స్టెల్‌కు బ్రాండ్‌గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్‌స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్‌. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్‌ లుక్‌లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్‌ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్‌ లవర్‌ బాయ్‌లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్‌ కాస్తా సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్‌ హెయిర్‌ కట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అబ్బాస్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్‌లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్‌ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు.

Bihar youth Marry his aunt Video Viral8
అత్త పాపిట తిలకం దిద్ది.. !

పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్‌ సుపౌల్‌ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్‌ పీఎస్‌ పరిధిలో జీవ్‌ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్‌ కుమార్‌ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్‌చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్‌ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్‌ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్‌తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్‌చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్‌చంద్ర అండ్‌ గ్యాంగ్‌ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025

Ys Jagan Expresses Serious Over Police Action Against Farmers In Bangarupalyam9
పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు

సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్‌ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్‌ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యల పైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్‌ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్‌ మాత్రమే ముందుంటాడు. ప్రతి పోలీస్‌ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐలు వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్‌ అనే వ్యక్తి ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్‌ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయేది జగన్‌ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన.

Halted Delhi Chief Minister Rekha Gupta Official Home Renovation10
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా యూటర్న్‌!

సాక్షి,ఢిల్లీ: రాజకీయ దుమారం రేపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (rekha gupta) అధికారిక నివాసం రెన్నోవేషన్‌ (Home Renovation) కాంట్రాక్ట్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) ఢిల్లీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. పునరుద్దరణ పనులను సైతం నిలిపివేసింది. ఇంటి రెన్నోవేషన్‌ కోసం టెండర్లకు ఆహ్వానించిన మూడు రోజుల తర్వాత పీడబ్ల్యూడీ విభాగం తాజా నిర్ణయం తీసుకుంది.సీఎంగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ సివిల్‌ లైన్స్‌లోని రాజ్‌ నివాస్‌ మార్గంలో రెండు బంగ్లాను కేటాయించింది. వాటిల్లో బంగ్లా వన్‌లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. బంగ్లా 2లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా ఉండనున్న ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు కానుంది.అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన ఓటీజీ (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్‌వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్‌, రూ.91 వేల విలువైన ఆరు గీజర్‌లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్‌ లైటర్లు, హ్యాంగింగ్‌ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేసే పనుల్ని కాంట్రాక్ట్‌ ఇచ్చేందుకు పీడబ్ల్యూడీ విభాగం టెండర్లకు ఆహ్వానించింది.అయితే, రేఖా గుప్తా నివాసం రెన్నోవేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. శిష్‌ మహల్‌ (Sheesh Mahal) అంటూ కేజ్రీవాల్ నివాసంపై విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే రీతిలో ఖర్చు చేస్తుందా?’అంటూ ఆమ​్‌ ఆద్మీ విమర్శలు గుప్పించింది. ప్రజలు నీటి కొరత, ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఏసీలు,టీవీలు కొనుగోలు చేయడంలో మునిగిపోయిందని కాంగ్రెస్‌ ద్వజమెత్తింది. ఈ క్రమంలో రేఖా గుప్తా ఇంటి రెన్నోవేషన్‌ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పీడబ్ల్యూడీ విభాగం ప్రభుత్వానికి సమాచారం అందించడం కొసమెరుపు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుంది. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు .ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్‌ లైన్స్‌లోని రాజ్‌ నివాస్‌ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement