40 అడుగుల హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు | Youth Climbs Atop 40-Ft Hoarding In Bhubaneswar To Commit Suicide Rescued | Sakshi
Sakshi News home page

40 అడుగుల హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు

Published Thu, Mar 23 2023 8:31 AM | Last Updated on Thu, Mar 23 2023 8:30 AM

శిశుభవన్‌ ఛక్‌ ప్రాంతంలో హోర్డింగ్‌ పైకి ఎక్కిన యువకుడు   - Sakshi

భువనేశ్వర్‌: నగరంలోని శిశుభవన్‌ ఛక్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. 40 అడుగుల హోర్డింగ్‌ పైకి ఎక్కి, కలకలం సృష్టించాడు. గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో 2గంటలు నిరవధికంగా శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అతనిని స్థానిక క్యాపిటల్‌ ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకుడు ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా సొరొ మండలం అంగులా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ సందర్భంగా అతని భార్య సుస్మితా పాత్ర మీడియాతో మాట్లాడుతూ తన భర్త భువనేశ్వర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. తీవ్రమైన పేదరికం కారణంగా ఈ వైపరీత్యానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తల దాచుకునేందుకు నిలువ నీడ లేదని, కుమర్తెల పాఠశాల ఫీజులు కట్టే స్తోమత లేక అల్లాడుతున్నట్లు వాపోయారు. ఈ నేపథ్యంలో తన భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement