Hoarding
-
40 అడుగుల హోర్డింగ్ ఎక్కిన యువకుడు
భువనేశ్వర్: నగరంలోని శిశుభవన్ ఛక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. 40 అడుగుల హోర్డింగ్ పైకి ఎక్కి, కలకలం సృష్టించాడు. గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో 2గంటలు నిరవధికంగా శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అతనిని స్థానిక క్యాపిటల్ ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకుడు ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సొరొ మండలం అంగులా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా అతని భార్య సుస్మితా పాత్ర మీడియాతో మాట్లాడుతూ తన భర్త భువనేశ్వర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. తీవ్రమైన పేదరికం కారణంగా ఈ వైపరీత్యానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తల దాచుకునేందుకు నిలువ నీడ లేదని, కుమర్తెల పాఠశాల ఫీజులు కట్టే స్తోమత లేక అల్లాడుతున్నట్లు వాపోయారు. ఈ నేపథ్యంలో తన భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని వివరించారు. -
యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా?
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్ రాజ్ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్ పోలీస్ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిలో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అభేయ్ కుమార్ సింగ్, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్ కేసరి, కాంట్రాక్టర్ రాజేశ్ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ అజీత్ సింగ్ చౌహాన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. ఈ వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్ సింగ్. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్ఎస్ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్ సింగ్. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు. ఇదీ చూడండి: టోల్గేట్ వద్ద 'ది గ్రేట్ ఖలీ' హల్చల్.. సిబ్బందిపై పంచ్‌లు! -
నగరంలోని ఆ నాలుగు రోడ్లలో నరకం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్ బండ్ మొదలు ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌడ్ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
మీకు చేతగాదా చెప్పండి.. మేమే తొలగిస్తాం
‘ఫ్లెక్సీల తొలగింపు’ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు, రోడ్లపై ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించే వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు ఈ నివేదికలను చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించడం చేతకాకపోతే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, వాటిని ఎలా తొలగింపజేయాలో తమకు తెలుసునని పేర్కొంది. తామిచ్చిన ఆదేశాల ప్రకారం.. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించేందుకు ఇరు ప్రభుత్వాలకు మరో 15 రోజుల గడువునిచ్చింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. -
ధరల కట్టడికి కట్టుబడి ఉన్నాం
అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదిస్తాం దేశ వృద్ధికి తోడ్పాటు అందించండి రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రి-బడ్జెట్ భేటీలో అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: అధిక ధరలు, అధిక వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌ని, అక్రమంగా నిల్వలు ఉంచడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కమోడిటీ చట్టాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో జైట్లీ ఈ విషయాలు తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల సామాన్యుల ఆహార, పౌష్టికాహార భద్రతకు నష్టం వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు వృద్ధి మందగించడం, మరోవైపు అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు .. దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాళ్లుగా మారాయన్నారు. కొన్ని రాష్ట్రాలు.. దేశాన్ని మించి వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో యావత్‌దేశాన్నీ మరింత వృద్ధి సాధించే దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఆర్థిక వృద్ధి సాధనలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదనే ప్రజలు కూడా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. వృద్ధిలో సమాన భాగస్వాములు కావాలి.. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందించాలని జైట్లీ కోరారు. సరఫరాపరమైన ఆటంకాలను తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిత్యావసరాల చట్టాన్ని పునఃసమీక్షించడంతో పాటు బ్లాక్‌మార్కెటింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ధరల సమాచారాన్ని రియల్ టైమ్‌లో ఇటు రైతులకు, అటు కొనుగోలుదారులకు చేరవేయగలిగే అవకాశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం వృద్ధి సాధనకు దోహదపడగలదని, త్వరలో దీనికి అడ్డంకులను తొలగించి అమల్లోకి తేగలమని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా అంటే కేవలం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదని, రాష్ట్రాలు కూడా వృద్ధి సాధనలో సమాన భాగస్వాములుగా ఉండాలన్నదే తమ విధానమని జైట్లీ చెప్పారు. ఈ దిశగా రాష్ట్రాలకు కావాల్సిన సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తామన్నారు. రాష్ట్రాలతో సమావేశంలో చర్చించిన అంశాలు, సూచనలు బడ్జెట్ రూపకల్పనలో గణనీయంగా తోడ్పడతాయని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను భారీగా పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుం దన్నారు. దీని వల్ల సిమెంటు, ఉక్కు, విద్యుత్ తదితర రంగాలు కూడా మందగమనం నుంచి బయటపడగలవని, భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభించగలవని జైట్లీ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయాలి.. ధరల పెరుగుదల నుంచి పేదలకు ఉపశమనం కలిగించాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సి ఉందని జైట్లీ చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కోసం రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా నిధులను మళ్లించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. జీఎస్టీ పై మెజారిటీ రాష్ట్రాల సుముఖత.. స్వల్ప అభ్యంతరాలు మినహా చాలా మటుకు రాష్ట్రాలు జీఎస్టీ అమలుపై సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, తమ ఆర్థిక స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పించాలని, దశలవారీగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(సీఎస్టీ) ఉపసంహరణ వల్ల వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ విధానంపై తమిళనాడు అభ్యంతరంచెప్పగా, పెట్రోలియం ఉత్పత్తులను దీన్నుంచి మినహాయించాలని అసోం సూచించింది.