● జాతరలో పాల్గొన్న సినీనటి నటాష
రాయగడ: స్థానిక తేజస్వీ మైదానంలో నెక్కంటి భాస్కరావు ఆధ్వర్యంలో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు ఆదివారం నిర్వహించారు. మజ్జిగౌరీ మందిరం నుంచి నిర్వహించిన కలశ యాత్రలో సినీ నటి నటాస పాల్గొన్నారు. ఈ యాత్రలో ఆమె కలశాన్ని పట్టుకుని కొద్ది దూరం నడిచారు. జనతాకిడి ఎక్కువగా ఉండటంలో వెంటనే టాప్‌లెస్ వాహనం ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా తప్పిటగుళ్లు, పులి వేషాలు, సంప్రదాయ నృత్యాలు, హరేరామ సంకీర్తనలతో ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా మజ్జిగ, తాగునీటి సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు.


