ఠాకురాణి అమ్మవారికి కానుకల సమర్పణ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో వెలసిన బుడి ఠాకురాణి అమ్మవారికి పుట్టింటి నుంచి కానుకలు తరలి వచ్చాయి. చైత్ర మాసం సందర్భంగా సోమవారం నుంచి అమ్మవారు ప్రతి రోజు పురవీధులలో పర్యటించనున్నారు. అమ్మవారి ఘటాలకు వీధులలో మహిళలు కానుకలు, పసుపు నీళ్లతో మొక్కుబడులు చెల్లిస్తారు. తొమ్మిది రోజులు అమ్మవారికి కావలసిన వస్త్రాలు, పూజా సామగ్రి, పూజారులకు వస్త్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా పట్టణంలోని గౌడ వీధిలోని పుట్టింటి నుంచి తరలివచ్చాయి. శతాబ్దాల క్రితం అమ్మవారు గౌడవీధిలో పుట్టి రాజు వీధికి తరలి వచ్చినట్లు ప్రజలు విశ్వసిస్తారు. అందువలన పుట్టింటి వారైన గౌడ వీధి ప్రజలు ఏటా అమ్మవారికి తొమ్మిది రోజులకు సరిపడా పూజా సామగ్రి అందజేస్తారు. మేళతాళాలతో ఊరేగింపు కావిళ్లతో పూజా సామగ్రి బుడి ఠాకురాణి అమ్మవారి గుడికి అందజేశారు.
ఠాకురాణి అమ్మవారికి కానుకల సమర్పణ
ఠాకురాణి అమ్మవారికి కానుకల సమర్పణ


