సుసంపన్న ఒడిశా లక్ష్యం
భువనేశ్వర్: సుసంపన్నమైన ఒడిశా నిర్మిద్దామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర స్థాయి ఉత్కళ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రాజ్‌భవన్ కూడలి ప్రాంతంలో ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మధుసూదన్ దాస్ జన్మస్థలం సత్యభామపూర్‌లో రాష్ట్ర స్థాయి ఉత్కళ దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష – సంస్కృతి విలువల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్తగా ఒడియా భాషా పక్షం నిర్వహిస్తుందని ప్రకటించారు. ఏటా క్రమం తప్పకుండా ఏప్రిల్ 1 నుంచి 14 ‘ఒడియా పక్షం కార్యక్రమం కొనసాగుతుందని సభాముఖంగా వెల్లడించారు. మన గొప్ప ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, నృత్యం, సంగీతం తదితర రంగాల్లో ఔత్సాహికులకు ఆదరణ, ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతికి గర్వ కారణంగా ప్రతి ఒడియా వ్యక్తి వృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
త్వరలో ఆయుష్మాన్ భారత్
రాష్ట్రంలో త్వరలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ప్రవేశ పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రానున్న రెండు వారాల్లో రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 52 లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 29,000కి పైగా ఆసుపత్రులలో వర్తింపజేయడం విశేషంగా పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో ఒడిశా భాగస్వామి..
భువనేశ్వర్: రాష్ట్ర పురోగతి నిరంతరం కొనసాగుతుందని, దేశ అభివృద్ధిలో ఒడిశా ముఖ్యమైన పాత్ర పోషించి ప్రముఖ భాగస్వామిగా నిలుస్తుందని రాష్ట్ర విపక్షం బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ పాలనలో బలమైన మౌలిక సదుపాయాల్ని పుష్కలంగా కల్పించినట్లు గుర్తు చేశారు. బిజు జనతా దళ్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2000 నుంచి 2024 సమగ్రంగా 24 సంవత్సరాలను ఒడిశా అభివృద్ధిలో సరి కొత్త యుగంగా అభివర్ణించారు. స్థానిక బిజూ జనతా దళ్ ప్రధాన కార్యాలయ సముదాయం శంఖ భవన్‌లో ఈ మేరకు ఉత్కళ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ భాషావేత్త దేబీ ప్రసన్న పట్నాయక్, జార్ఖండ్ మాజీ మంత్రి డాక్టర్ దినేష్ షడంగి తదితర ప్రముఖులను ఉత్కళ దివస్ సత్కారంతో అభినందించారు.
సీఎం మోహన్‌చరణ్ మాఝి
ఘనంగా రాష్ట్ర స్థాయి ఉత్కళ దినోత్సవం
సుసంపన్న ఒడిశా లక్ష్యం
సుసంపన్న ఒడిశా లక్ష్యం
సుసంపన్న ఒడిశా లక్ష్యం
సుసంపన్న ఒడిశా లక్ష్యం
సుసంపన్న ఒడిశా లక్ష్యం


